AKP : నాతవరం పోలీస్ స్టేషన్ పరిధి వైవి పట్నం గ్రామంలో కన్న తల్లిని హత్య చేసిన ఘటనలో ముద్దాయి చిటికెల రామ్మూర్తి నాయుడును అరెస్టు చేసినట్లు డీఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఇంటిలో నివసిస్తున్న తల్లి మంగపై ముద్దాయి తాగి వచ్చి తల్లిని తల మీద పూల కుండీతో కొట్టి, మెడపై కాలితో తొక్కి బంగారుతాడును తీసుకుని పారిపోయాడని తెలిపారు.