TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తానని కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నానని పేర్కొన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. MLAగా గెలిచి మంత్రిగా అవుతానని.. హైదరాబాద్, యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రి లేరని తెలిపారు. పొన్నం ప్రభాకర్ తనకంటే జూనియర్ అని చెప్పుకొచ్చాడు.