ADB: వర్షాకాలం నేపథ్యంలో మురికి నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని మండల వైద్యాధికారి నిఖిల్ రాజ్ సూచించారు. భీంపూర్ మండలంలోని గోన, అంతర్గాం, గోమూత్రి, లక్ష్మిపూర్, బెల్సరీ రాంపూర్ గ్రామాల్లో శనివారం వైద్య సిబ్బంది పర్యటించారు. నీరు నిల్వ ప్రాంతాల్లో రసాయనాలను పిచికారి చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.