NLG: మునుగోడు మండలం పలివెల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు MLA రాజగోపాల్ రెడ్డి రూ.7 లక్షల విలువైన 110 డెస్క్ బెంచీలను వితరణగా అందజేశారు. ఇటీవల మార్నింగ్ వాక్‌లో భాగంగా పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులు బెంచీల సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన శనివారం తన సొంత ఖర్చులతో బెంచిలను సమకూర్చి విద్యార్థుల చదువులకు చేయూతనిచ్చారు.