దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలుగా ‘నమో భారత్’ అవతరించింది. ఢిల్లీ-మీరట్ మార్గంలో గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించి వందేభారత్(130కి.మీ) వేగాన్ని వెనక్కి నెట్టింది. తొలుత వందేభారత్ కూడా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించేది. తర్వాత వాటి వేగాన్ని 160 నుంచి 130కి.మీలకు రైల్వేశాఖ కుదించింది. వందేభారత్‌కు ముందు దేశంలో అతి వేగవంతమైన రైలుగా ‘గతిమాన్ ఎక్స్‌ప్రెస్’ ఉండేది.