KRNL: సి. బెళగల్ మండలంలోని సంగాల, తిమ్మందిడ్డి గ్రామాల్లో ఖాళీగా ఉన్న రెండు అంగన్వాడీ పోస్టులకు అర్హులైన మహిళలు సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని కోడుమూరు ప్రాజెక్ట్ సీడీపీవో వరలక్ష్మిదేవమ్మ ఇవాళ తెలిపారు. సంబంధిత ధ్రువపత్రాలు రెండు సెట్లుగా సమర్పించాలని పేర్కొన్నారు.