కృష్ణా: ప్రజలతో కలిసి ఉంటూ వారి సహచరుడిగా సమస్యల పరిష్కరించడంలోనే నాకు సంతృప్తి ఉంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. పట్టణం 8వ వార్డు సచివాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శనివారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.