MHBD: జిల్లాలో బిట్‌కాయిన్ ట్రెండింగ్ పేరుతో భారీ మోసం నేడు వెలుగులోకి వచ్చింది. మెడికల్ షాప్ నిర్వాహకుడికి వాట్సాప్‌లో లింక్ పంపి, బిట్‌కాయిన్‌లో పెట్టుబడితో లాభాలు వస్తాయని నమ్మించి, మొదట రూ.50 వేలు, అనంతరం రూ.5 లక్షలు తీసుకున్నారు. వాలెట్లో రూ.10 లక్షలు కనిపించేలా చేసి, రూ.32,53,000 దోచుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.