KDP: సిద్దవటం మండలం భాకరాపేటలో వేంపల్లికి చెందిన ఇద్దరు మహిళలు ఇవాళ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కడప – చెన్నై జాతీయ రహదారి మలినేని పట్నం గ్రామ సమీపంలో రేషన్ తరలిస్తున్న ఆటోను సిద్దవటం ASI బాబయ్య తనిఖీ చేసి 120 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషనుకు తరలించారు.