NZB: జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా పని చేయడం లేదని నిజామాబాద్ MP అర్వింద్ ధర్మపురి ఆరోపించారు. శనివారం ఆయన NZB CP సాయి చైతన్యతో సమావేశమై పలు అంశాలపై చర్చించి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఉగ్రవాద చర్యలను అరికట్టాలన్నారు. హిందువులు, హిందు పండగలపై ఆంక్షలు పెడుతున్నారని, వినాయక నిమజ్జన వేడుకల్లో హిందూ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు.