NTR: విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు ఆరోపించారు. శనివారం ఆయన ఆ ప్రాంతంలో పర్యటించారు. నీరు రంగు మారిందని, ప్రజలు చనిపోతున్నారని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.