VSP: జీవీఎంసీ 6వ వార్డు కొమ్మాది ప్రాంతంలో రూ.1 కోటి నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సదుపాయాల విస్తరణతో పాటు ప్రజా అవసరాలకు అనుగుణంగా పలు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల అభ్యున్నతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.