NTR: విజయవాడ ఉత్సవాన్ని అడ్డుకుంటానని దేవినేని అవినాశ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అవినాష్ తన వెనకున్న రౌడీ, గంజాయి బ్యాచ్‌ను చూసుకొని రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. దసరా ఉత్సవాలకు వచ్చే ప్రజల కోసం ఎంపీ కేశినేని చిన్ని ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహిస్తున్నారన్నారు.