ELR: కలిదిండి మండల డిప్యూటీ తహసీల్దార్‌గా గీత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆమె చాట్రాయి మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసి, డిప్యూటేషన్ పై కలిదిండి మండలానికి వచ్చారు. మండల ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.