ASR: డుంబ్రిగుడ మండలంలోని కోసంగి గ్రామ శివారులో ఇవాళ మేకలు మేతకు తీసుకెళ్లిన మహిళపై కందిరీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో గ్రామానికి చెందిన ఇచ్చామ్మ అనే మహిళ తలపై గాయాలపాలయ్యారు. మేకలు మేత కోసం వెళ్తుండగా అకస్మాత్తుగా కందిరీగలు విరుచుకుపడి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హుటాహుటిన ఆమెను డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.