MDCL: కూకట్ పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్నామని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. నిందితులను రాంచీలో పట్టుకున్నామన్నారు. హఫీజ్ పేట వద్ద క్యాబ్ తీసుకొని పరారయ్యారని, ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లి రాంచీలో నిందితులను పట్టుకున్నారన్నారు. హఫీజ్ పేట నుంచి సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి రైలులో రాంచి వెళ్దామని నిందితులు ఆలోచించారన్నారు.