W.G: భీమవరం బైపాస్ రోడ్డులోని రైల్వే గేటు సమీపంలో ఉన్న పంట కాలువలో శనివారం ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు తోట సత్యనారాయణ (45) గా పోలీసులు గుర్తించారు. గత 4 రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.