GNTR: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా బహిరంగ మార్కెట్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారని శనివారం భారతీయ కిసాన్ సంఘ్ కొల్లిపర మండల తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసింది. మండలంలో 15వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. సకాలంలో ఎరువులు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొని, రైతులకు సరసమైన ధరలకు ఎరువులు ఇవ్వాలని కోరారు.