NTR: విజయవాడలోని దుర్గ గుడి ఆలయంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను, క్యూలైన్లు, శానిటేషన్ పనులను కలెక్టర్ డా.లక్ష్మీశా శనివారం పరిశీలించారు. భక్తులకు అంతరాయం లేకుండా అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని, AI సాంకేతికత సహాయంతో వివిధ శాఖల సమన్వయంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. కలెక్టర్‌తో పాటు EO శీనానాయక్ కూడా ఉన్నారు.