RR: ప్రజల ఆరోగ్య రక్షణ కర్తవ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ.11.16,500 సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.