SKLM ఆమదాలవలసలో గ్రామదేవత శ్రీ పాల పోలమ్మతల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వానించారు. ఎమ్మెల్యేను కలిసిన కమిటీ సభ్యులు ఈ ఏడాది ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కూన. అప్పలనాయుడు, పాతిన. రమణ ఉన్నారు.