MDK: ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు ఈనెల 18 వరకు గడువు పెంచుతూ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇది చివరి అవకాశం అని, అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.