CM Kcr Derogation to ambedkar constitution:YS Sharmila
YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరిచారని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ద్రోహి కేసీఆర్ అని షర్మిల విరుచుకుపడ్డారు. 125 అడుగుల విగ్రహం పెడితే అంబేడ్కర్‌ను (ambedkar) గౌరవించినట్టు అవుతుందా అని అడిగారు. 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ భారత రాజ్యాంగం చదవలేదన్నారు. అందుకే రాజ్యాంగం పుస్తకాన్ని బహుమతిగా పంపిస్తున్నానని వివరించారు. తెలంగాణలో నడిచేది భారత రాజ్యాంగం కాదు..కేసీఆర్ సొంత రాజ్యాంగం అని షర్మిల విమర్శించారు.
యావత్ ప్రపంచం భారత రాజ్యాంగాన్ని గౌరవించడానికి కారణం అంబేడ్కర్ (ambedkar) అని షర్మిల (sharmila) తెలిపారు. సమాజంలో అసమానతలు, అంటరానితనం లేదంటే అంబేడ్కర్ కారణం అని వివరించారు. దళితులు, బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడారని గుర్తుచేశారు. గొర్రెల్లా ఉండకండి మిమ్మల్ని బలిస్తారని ప్రజలను చైతన్యవంతులను చేసి.. హక్కుల కోసం కొట్లాడిన మహనీయుడు అంబేడ్కర్ అన్నారు. బలహీన వర్గాల కోసం రాజ్యాంగం రచిస్తే తెలంగాణ రాష్ట్రంలో అంబేడ్కర్‌కు, ఆయన రచించిన రాజ్యాంగానికి, దళితులకు గౌరవం లేదన్నారు.
దళిత ముఖ్యమంత్రి నుంచి దళిత బంధు వరకు కేసీఆర్ (kcr) దళితులను మోసం చేశాడని షర్మిల (sharmila) గుర్తుచేశారు. దళిత ఉప ముఖ్యమంత్రి అని ఇంకో అవమానం అని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇల్లు అని, దళితులకు మూడెకరాల భూమి అని , ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా మోసగించారని గుర్తు చఏశారు. ఉచిత విద్యుత్ అని మోసం.. దళిత బంధు అని మోసం చేశారన్నారు. 19 లక్షల దళిత కుటుంబాలు ఉంటే కేవలం 32 వేల మందికి మాత్రమే దళిత బంధు అందించారని తెలిపారు. దళితులు..అంబేడ్కర్ మీద ప్రేమ ఉంటే మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితబంధు, కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలని షర్మిల (sharmila) డిమాండ్ చేశారు.
రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ (kcr) ఎలా అంటారని షర్మిల అడిగారు. 57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడానికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అడ్డొచ్చిందా? ఉచిత ఎరువులు ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా? మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందా? ఏ హామీలు నెరవేర్చడానికి రాజ్యాంగం అడ్డొచ్చిందని మార్చాలని అన్నారని షర్మిల నిలదీశారు. మరియమ్మ అనే దళిత మహిళను జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేసిన ప్రభుత్వం ఇదీ అని షర్మిల (sharmila) మండిపడ్డారు.