SRPT: అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను శుక్రవారం సాయంత్రం పోలీసులు సీజ్ చేశారు. దొసపహాడ్ శివారులో మూసీ నది నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించి, కేసు నమోదు చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై గోపికృష్ణ తెలిపారు. అక్రమ రవాణాపై చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.