WGL: ఎనుమాముల మండల రేషన్ నిల్వ కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. నిల్వలో ఉన్న బియ్యం నాణ్యత, భద్రతా ఏర్పాట్లు, నిల్వ విధానం, రికార్డుల నిర్వహణను జాగ్రత్తగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. సమర్థంగా నిర్వహణ కొనసాగించి రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు మరింత పటిష్టం చేయాలని డీలర్లకు సూచించారు.