TPT: పుత్తూరు పట్టణంలోని పరమేశ్వరమంగళం KKC కళాశాల సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న లారీ అతివేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు సతీశ్ అరక్కోణం మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన సతీశ్, ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు.