ప్రకాశం: దోర్నాల మండలం కొర్రప్రోలు వద్ద కర్నూలు – గుంటూరు జాతీయ రహదారిపై శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని 108 అంబులెన్స్‌లో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, గాయపడ్డవారు నల్లగుంట్లకి చెందినవారిగా సమాచారం. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.