ప్రకాశం: ఒంగోలు ప్రస్తుత కలెక్టర్ తమిమ్ అన్సారియాను శుక్రవారం ఏపీ మారీ టైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె బదిలీపై గుంటూరుకు వెళ్తున్న కలెక్టర్ తమిమ్ అన్సారియాకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి సహాయ సహకారాలు అందించిన కలెక్టర్కు దామచర్ల సత్య కృతజ్ఞతలు తెలిపారు.