MDK: పెద్ద శంకరంపేట మండలంలోని ముసపేటకి చెందిన గంగమేశ్వర్ మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిఅతడు తిరిగి రాలేదు. గంగమేశ్వర్ ఇటీవల ఓ కేసులో జైలుకు వెళ్ళి పది రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మనస్థాపంతోనే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తండ్రి దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.