ELR: జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) సూర్య చంద్రరావుతో వయో వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. వృద్ధుల పట్ల అమానుష ప్రవర్తనలు, సంతానాల నుంచి జరిగే అఘత్యాలు, చట్టాల అమలులో లోపాలు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల సంక్షేమం కోసం ఉన్న చట్టాలు చాలామంది పట్టించుకోకుండా ఉంటున్నాయన్నారు. అవగాహన కొరత వల్ల ఈ సమస్యలు కొనసాగుతున్నాయన్నారు.