VZM: కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సంకల్ప్ ప్రత్యేక అవగాహనా కార్యక్రమం జిల్లా వన్ స్టాప్ సెంటర్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం గంట్యాడలో జరిగింది. దీనిలో భాగంగా సఖి నివాస్, 181 మహిళా హెల్ప్ లైన్, 1098 చైల్డ్ హెల్ప్ లైన్, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం వంటి వాటిపై అవగాహన కల్పించారు.