KRNL: ఆదోని జిల్లాతో పాటు, ఆదోని మండలంలోని పెద్ద హరివాణం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని హరివాణం గ్రామస్థులు ఎంపీ బస్తిపాటి నాగరాజును కోరారు. ఇవాళ నగరంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఆదోని జిల్లాతో పాటు, హరివాణాన్ని మండలం కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.