SRCL: శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్ పర్సన్, న్యాయమూర్తి పి. నీరజ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో ఉదయం 10.30 గంటల నుంచి జాతీయ లోక్ అదాలత్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.