MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని గ్రామస్థులు కోరారు. సబ్ కలెక్టర్ మనోజ్ కు శుక్రవారం గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు 80% ఉపాధి హామీ పనిపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. మున్సిపాలిటీలో విలీనం చేస్తే ఉపాధి హామీ పథకం దొరకక ప్రజలకు జీవనోపాధి ఇబ్బంది అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.