మాల్దీవుల్లో ఘోర అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో… 11మంది ప్రాణాలు కోల్పోగా… వారిలో 9మంది భారతీయులు కూడా ఉండటం గమనార్హం.
మాల్దీవుల రాజధాని మాలేలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి 12.30 గంటలప్పుడు మవియో మసీదు సమీపంలోని నిరుఫెహి ప్రాంతంలో ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాహనాల మరమ్మతుల గ్యారేజ్ నుంచి తొలుత మంటలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారని తెలిపారు.