KMM: బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి బస్టాండ్ వద్ద ఎస్సై పొదిలి వెంకన్న, ఇవాళ వాహన తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాక్టర్లకు సరైన డాక్యుమెంట్లు లేకపోయిన, ఇసుకపై పట్టా కప్పని పక్షంలో జరిమానాలు విధిస్తామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.