గద్వాల మండలం బస్సాల చెరువు గ్రామానికి చెందిన రిటైర్డ్ అగ్రికల్చర్ ఉద్యోగి కాంత్ రెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న శుక్రవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్ కాలనీలో ఉన్న ఆయన స్వగృహానికి వెళ్లి, కాంత్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.