KMM: రైతులకు సరిపడా యూరియా అందించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సూపర్డెంట్కి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లనే రైతులు నష్టపోతున్నారని, నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన సర్వే నిర్వహించాలన్నారు.