BPT: ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థిక సాయం చేయడం చరిత్రాత్మక నిర్ణయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న అన్ని వర్గాల ప్రజలకు ఇది మేలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజమైన సంక్షేమాన్ని అందిస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు.