TG: వరంగల్ జిల్లా రాయపర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. యూరియా కోసం రాయపర్తి మండల రైతులు రొడ్డెక్కి ధర్నా నిర్వహించారు. వారికి మద్దతుగా ఎర్రబెల్లి ధర్నాలో కూర్చున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగింది.