NLG: మునుగోడులోని సెయింట్ జోసెఫ్ ప్రైవేటు పాఠశాల బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని DYFI మండల కమిటీ MEOకు వినతిపత్రం అందజేసింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదమని జిల్లా సహాయ కార్యదర్శి లింగస్వామి హెచ్చరించారు. అధిక ఛార్జీలు వసూలు చేయడంతో పాటు సుదీర్ఘ ప్రయాణాల వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.