SRCL: కోనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ ఛైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండ నర్సయ్య, వట్టిమల్ల మాజీ సర్పంచ్ దర్శనాల శంకరయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి తాము కాంగ్రెస్లో చేరుతున్నట్లు వారు తెలిపారు.