AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇల్లు కట్టారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో పెద్దారెడ్డి హుటాహుటిన తాడిపత్రికి బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు పుట్లూరు దగ్గర పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. జేసీ ఆదేశాలతో సర్వే చేస్తున్నారని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.