BDK: జూలూరుపాడు మండలం చెందిన ఏబీఎన్ రిపోర్టర్ దుద్దుకురి రామారావు తండ్రి దుద్దుకురి గోపయ్య శుక్రవారం మరణించారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వార్త వినగానే వెళ్లి గోపయ్య భౌతిక కాయానికి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి ధైర్యం నింపుతూ మనోధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.