MNCL: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని ప్రజా భవన్కు వెళుతున్న జేఏసీ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడం సరికాదని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే నెలరోజుల్లో వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.