WGL: పట్టణంలోని శ్రీ భద్రకాళి ఆలయంలో భాద్రపద మాస శుక్రవారం సందర్భంగా అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు, హారతులు ఇచ్చారు. శుక్రవారం కావడంతో ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయం మార్మోగింది.