NRML: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి మున్సిపల్ ఆఫీస్ ముందు భైఠాయించారు. తమకు జీతాలు పెంచాలని అలాగే పిఎఫ్ డబ్బులు ఖాతాలలో వేయాలని డిమాండ్ చేశారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారు.