MNCL: జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో శుక్రవారం నుంచి వైద్య సేవలు పునఃప్రారంభించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి వరద నీరు కేంద్రం సమీపంలోకి రాగా, గత నెల 28న అందులోని బాలింతలు, గర్భణులు, చిన్నారులను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వరద తగ్గుముఖం పట్టడంతో OP సేవలు అందిస్తామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.