E.G: రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరుకు చెందిన శిరీష అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు జైదీప్ వీర (4), మోక్ష శ్రీ వీర (1)లతో సహా అదృశ్యమైంది. తన భార్య, పిల్లలు కనిపించడం లేదని భర్త ఆకాశపు మోహన్ కుమార్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై ప్రియా కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.