»Shakuntalam Premiere Shows Cancelled What Is The Reason
Shakuntalam: ప్రీమియర్ షోలు రద్దు..కారణమెంటీ?
సమంత(Samantha) మెయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన శాకుంతలం(Shakuntalam) మూవీ ప్రీమియర్ షోలు(premiere shows) రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ఏప్రిల్ 10న వేసిన ప్రీమియర్ షోలలో సినిమాలో కొన్ని తప్పులు కనిపించాయని.. వాటిని మార్పు చేసి మళ్లీ ఏప్రిల్ 13న మీడియా కోసం ప్రీమియర్స్ వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో రేపు ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
ప్రముఖ నటి సమంత(Samantha) కీలక పాత్రలో యాక్ట్ చేసిన శాకుంతలం మూవీ(Shakuntalam movie) ప్రీమియర్ షోలు రద్దు అయినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఎందుకు రద్దు చేశారని టాలీవుడ్ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయి. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించబడింది. ఇది ఇతిహాసం మహాభారతంలోని ఆది పర్వానికి సంబంధించినది. ఈ చిత్రం 14 ఏప్రిల్ 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుండడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఉత్కంఠ పెరిగింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతుంది. ఈ మూవీ 3డి ఫార్మాట్లో కూడా విడుదలవుతుండడంతో సమంత కూడా ఈ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది.
మరోవైపు మేకర్స్ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. సమంతా(Samantha) దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తుంది. ఎంపిక చేసిన మీడియా సిబ్బంది, సెలబ్రిటీల కోసం మేకర్స్ స్పెషల్ ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. అయితే సినిమాను చూసిన వారు సినిమాపై పలువురు ప్రశంసలు కురిపించగా, ఇంకొంత మంది మాత్రం బాలేదని అన్నట్లు తెలిసింది. దీంతో సమంతా తన ప్రమోషన్లను హఠాత్తుగా రద్దు చేసినట్లు తెలిసింది. మరోవైపు మేకర్స్ కూడా ప్రీమియర్ షోలను పూర్తిగా రద్దు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో సినిమా అవుట్పుట్ సరైన స్థాయిలో లేదనే విషయం స్ప్రెడ్ అవుతుంది. నెగిటివ్ టాక్(negative talk), రివ్యూలకు భయపడి మేకర్స్ షోలను క్యాన్సిల్ చేసిందని.. సమంత ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో ఆసక్తి చూపడం లేదని పుకార్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక లోపం కారణంగా ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు ఇప్పటికే గుణశేఖర్ స్పష్టం చేశారు.
ఏప్రిల్ 10న ప్రీమియర్ షో(premiere show) తర్వాత కొన్ని లొసుగులను గమనించామని, వాటిని పరిష్కరించిన తర్వాత 13 ఏప్రిల్ 2023న మీడియా కోసం ప్రీమియర్లను ప్రదర్శిస్తామని ఆయన అన్నారు. ఈ క్రమంలో శాకుంతలం సినిమాని సినీ ప్రేమికులు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.